హైదరాబాద్: 28°C
వార్తలు

నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 ఉండేదా?: హరీష్ రావు

TG: సిద్దిపేటలో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా దీక్షా దివస్ నిర్వహించినట్లు మాజీమంత్రి హరీష్ రావు తెలిపారు. NOV 29న KCR చేపట్టిన దీక్ష లేకుంటే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదన్నారు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగేది కాదన్నారు. KCR దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రక్రియపై ప్రకటన చేసిందన్నారు. అయితే డిసెంబర్ 23న కేంద్రం ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు