విజయనగరం: రెండవ విడతలో జిల్లాలో పలు మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ దామోదర్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. ఆయన వెంట డీఎస్పీ లక్ష్మణమూర్తి, సీఐలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ


