E.G: జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో పెన్షన్ల పంపిణీ చేపట్టాలని తెలిపారు. అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలకు లోబడి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు


