KKD: గొల్లప్రోలు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తర్వాత ఒక వాహనదారుడు అక్కడి నుంచి వెళ్లిపోగా, మరో వాహనదారుడు అక్కడే ఉండి పోలీసులకు పిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలు హైవేపై రోడ్డు ప్రమాదం


