KRNL: కోసిగి మండలం సాతనూరులో ఎన్నికల విధుల్లో అధికారుల పట్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆదివారం విధుల్లో ఉన్న సిబ్బందికి మధ్యాహ్న భోజనాన్ని చెత్త తరలించే రిక్షాలో తీసుకొచ్చారు. కనీస పరిశుభ్రత పాటించకుండా ఆహార పొట్లాలు తరలించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇలాంటి భోజన సరఫరా ఏమిటంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త రిక్షాలో ఎన్నికల సిబ్బందికి భోజనం


