హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఐగాట్ కర్మయోగి పోర్టల్‌లో 7,000కు పైగా కోర్సులు’

'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ఐగాట్(iGOT) కర్మయోగి పోర్టల్ గురించి ప్రస్తావించారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇందులో 17 భాషల్లో 7,000కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగులు ఎన్నో కోర్సులు పూర్తి చేశారని తెలిపారు. కొందరు ఏఐ నేర్చుకుంటుండగా, మరికొందరు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అభ్యసిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.