హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిఫైనరీ ఏర్పాటు జిల్లాకు మైలురాయి'

NLR: రామాయపట్నంలో BPCL ఆధ్వర్యంలో భారీ రిఫైనరీ ఏర్పాటు కావడం నెల్లూరు జిల్లా అభివృద్ధికి కీలక మైలురాయి అని ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రిఫైనరీ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలిపారు.