VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఐఏఎస్ అధికారులు బగాడి గౌతమ్, అశ్వతి.ఎస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో పాలూరి నర్సింగరావు వారికి స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న IAS అధికారులు


