NLR: మర్రిపాడు మండలంలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందికి పంచాయతీల వారీగా ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంచాయతీ ఎన్నికలకు సామాగ్రి పంపిణీ


