SKLM: ఓ.వీ.పేట సచివాలయంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ శనివారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర, నచ్చిన మిల్లుకు అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని బుడుమూరు సూర్యారావు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'


