కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతున్న అగ్రిగోల్డ్ అసలు బాండ్ల పరిశీలనను నవంబరు 30 నుంచి డిసెంబరు 6 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధానమంత్రి తిరుపతి పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు కొత్త తేదీ ప్రకటించే వరకు కార్యాలయానికి రావద్దని, దూర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలనకు విరామం


