హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో వార్డు సభ్యులుగా ఎన్నికైన భార్యాభర్తలు

KDP: పోరుమామిళ్ల మేజర్ పంచాయతీలో భార్యాభర్తలు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఐదో వార్డులో రామచంద్రయ్య 285 ఓట్ల ఆధిక్యంతో, పదో వార్డులో ఆయన భార్య కోటమ్మ 95 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జనసేన మద్దతుతో పోటీ చేసిన వీరిద్దరూ రోజువారీ కూలీలు కావడం విశేషం. వీరి విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.