కోనసీమ: ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత జనార్దన స్వామివారు కార్తీక మాసం సందర్భంగా శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కూర్మావతారంలో దర్శనమిచ్చిన జనార్దన స్వామి


