హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం'

W.G: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. తాడేపల్లిగూడెం డివిజన్‌లోని ఏడు మండలాల్లో 933 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, 2,50,998 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు.