ATP: గుత్తి పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సర్కిల్ అయిన రాజీవ్ గాంధీ సర్కిల్, గాంధీ చౌక్ వద్ద గంటలపాటు ట్రాఫిక్ నిలబడిపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ప్రధాన సర్కిల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ సమస్యతో ప్రజల ఇబ్బందులు


