హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల మెటీరియల్‌తో బయలుదేరిన సిబ్బంది

ELR: ఉంగుటూరు మండలంలో ఆదివారం జరిగే పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శనివారం ఎన్నికల విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది ఎన్నికల మెటీరియల్‌ను తీసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, సిరా, సీళ్లు, తదితర సామగ్రిని అందజేశారు. అనంతరం వారికి కేటాయించిన బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.