ATP: కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల్లో రీకౌంటింగ్ కోరినందుకు కౌంటింగ్ హాల్‌లోనే తమపై దాడి జరిగిందని టీడీపీ మద్దతు అభ్యర్థి రోజా ఆరోపించారు. అనంతపురం ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆమె మాట్లాడారు. వైసీపీ శ్రేణులు తనను తోసేసి, భర్తపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో ఆర్‌ఓ, ఎస్సై సహకరించలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ హాల్‌లో దాడి జరిగింది: సర్పంచ్ అభ్యర్థి


