హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు 640 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

PPM: నవంబర్ 29న జిల్లాలోని పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వీ. మాధవ్ రెడ్డి తెలిపారు. నాలుగు మండలాల పరిధిలోని 147 పోలింగ్ లొకేషన్లకు సుమారు 640 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు.