SKLM: ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని 28 వార్డుల్లో వాటర్ సప్లై పైపు లైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవి శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పైపు లైన్ మరమ్మతు.. రోజు విడిచి రోజు నీటి సరఫరా


