ASR: జీకేవీధి నూతన ZPTC కంకిపాటి గిరిప్రసాద్, MPP పూజారి లీలాప్రసాద్ శనివారం తొలిసారి గాలికొండ పంచాయతీలో పర్యటించారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పూల బొకేలు అందించి, శాలువాలతో సన్మానించారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ MPP కుమారి, గిరి, దావీదు, గణేష్, MPTC జ్యోతి లక్ష్మి, మాజీ సర్పంచ్ బుజ్జిబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ZPTC, MPPలకు ఘన స్వాగతం


