హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో ఫూలే వర్ధంతి వేడుకలు

KRNL: ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు పేర్కొన్నారు.