KRNL: ఆశ వర్కర్లకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రాముడు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన ఆశ వర్కర్లకు తగిన వేతనాలు, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. డిసెంబర్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆశ వర్కర్లకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలి'


