VZM: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఎస్పీ కార్యాలయంలో అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, మత్తుకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ప్రజలంతా శాంతియుతంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువత మేలుకో.. భవిష్యత్తును కోల్పోకు: ఎస్పీ


