కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమి సమావేశం ముగిసింది. డీలిమిటేషన్ పేరుతో అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకునే ప్రయత్నం జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను పట్టించుకోకుండా డీలిమిటేషన్ చేపడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లును ఇండి కూటమి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
వార్తలు
డీలిమిటేషన్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: ఖర్గే


