హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆకాశ్ అంబానీ అడగడంతో కెప్టెన్సీ: రోహిత్

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మళ్లీ పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కెప్టెన్సీ బాధ్యతలను నాకు అప్పగించాలని MI మేనేజ్‌మెంట్ భావించింది. తొలుత నేను అందుకు అంగీకరించలేదు. గత సీజన్లలో ఎదరైన నిరాశతో కొంత సమయం కావాలని అడిగా. కానీ, ఆకాశ్ అంబానీతో చర్చించిన అనంతరం ఓకే చెప్పా' అని వెల్లడించాడు.