హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 4న తపాలా అదాలత్

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో తపాలా సేవలకు సంబంధించిన వినియోగదారుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 4న తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వి. హరిబాబు శనివారం ప్రకటనలో తెలిపారు. ఉ. 10గం.లకు రెల్ల వీధిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఫిర్యాదులను DEC 3లోపు పోస్టు ద్వారా పంపాలని సూచించారు.