హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాపరాయిలో పర్యాటకుల సందడి

ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం శనివారం పర్యాటకులతో సందడిగా మారింది. గత వారంతో పోలిస్తే ఈ వారం పర్యాటకుల రాక కాస్త పెరిగింది. కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. మరోవైపు స్థానిక గిరిజన మహిళలతో కలిసి దింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.