ATP: గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో శనివారం రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు బాధితురాలిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. మహిళకు గాయాలు


