SKLM: పోలాకి మండలం గుల్లవానిపేట (రాజపురం) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన దాసరి లక్ష్మీ దేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆమెకు అభినందనలు తెలిపారు. గ్రామంలో విభేదాలు లేకుండా అందరూ ఏకతాటిపై నిలిచి ఎన్నుకోవడం అభినందనీయమని, గ్రామ ఐక్యతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామ ఐక్యతకు ఏకగ్రీవాలు నిదర్శనం'


