హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికలను యజ్ఞంలా నిర్వహించాలి'

AKP: ఎన్నికలను పోలీసులు యజ్ఞంలా నిర్వహించాలని స్ట్రైకింగ్ ఫోర్స్ సీఐ రేవతమ్మ సూచించారు. కోటవురట్ల మండలంలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అందరికన్నా ముందు పోలీసులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.