హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టోల్ వివాదం.. ఐదుగురు ఉద్యోగులపై వేటు!

GNTR: అమరావతిలోని వెంకటపాలెం టోల్ ఫీజు వివాదంలో ఐదుగురు ఉద్యోగులపై వేటు పడింది. గుంటూరు వెళ్తున్న ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను సిబ్బంది రూ.100 ఫీజు అడగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జ్ సుమిత్ కుమార్ సర్దిచెప్పినా వినకుండా ఆదేశించడంతో.. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, సూపర్‌వైజర్‌ సహా ముగ్గురు టోల్ కలెక్టర్లను తొలగించడంతో సిబ్బందిలో కలకలం రేగింది.