TPT: శనివారం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండి, క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. టోకెన్ లేని సర్వదర్శనానికి 18-20 గంటలు, శీఘ్రదర్శనానికి 4 గంటల పైగా పడుతోందని టీటీడీ తెలిపింది. శుక్రవారం 63,645 మంది దర్శించుకోగా, 28,029 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల


