హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే వసంత కృష్ణను పరామర్శించిన మాజీ ఎంపీ!

ఎన్టీఆర్: ఐతవరం గ్రామంలో మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మాజీ సర్పంచ్ వసంత హైమావతి మృతి పట్ల విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాసరావు (నాని) ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను పరామర్శించడానికి ఆయన ఈరోజు ఉదయం 10 గంటలకు ఐతవరం గ్రామానికి విచ్చేశారు. రాజకీయ మిత్రుడిగా, ఆ కుటుంబానికి ఆత్ముడిగా నాని తన సంతాపం తెలిపారు.