హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

BPT: చీరాల ఆర్వోబీ బ్రిడ్జి సమీపంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.