ప్రకాశం: కొండేపి మండలం పెరిదేపి గ్రామంలో వందల ఎకరాల్లో పొగనారు సాగు చేసిన రైతులు ధరలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో మూట రూ. 5 వేలకు పైగా పలకగా, ప్రస్తుతం రూ. 1,200కే పడిపోయింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, కూలీలకు కూలీ ఇచ్చేందుకు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొగనారు ధరల పతనంతో రైతుల ఆందోళన


