హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేలప్రోలు ఎన్నికల్లో నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు!

కృష్ణ: తేలప్రోలు పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం జోరుగా సాగినట్లు చర్చ జరుగుతోంది. 7 వేలకు పైగా ఓటర్లు ఉన్న పంచాయతీలో YCP ఓటుకు రూ.4 వేలు నుంచి రూ.7 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. TDP అన్ని వార్డుల్లోనూ ఓటుకు రూ.2 వేల చొప్పున ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇరు పార్టీల ఖర్చు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.