హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోళ్లవలస పంచాయతీ పరిధిలో ఉద్రిక్తత

VZM: సంతకవిటి మండలం గోళ్లవలస పంచాయతీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓట్లకు రక్షణ కల్పించాలని ఎస్ఆర్, ఎంఆర్ అగ్రహారం గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. గోళ్లవలసలో ప్రతి ఎన్నికల్లోనూ ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటు వేసేలా చొరవ చూపాలని కోరారు.