హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా పార్లపల్లి రోడ్డు

NLR: విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో రహదారి గుంతలమయంగా మారింది. గమళ్లపాలెం నుంచి రాళ్లమెట్ట వరకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు గుంతల్లో నిల్వ ఉండటంతో అవి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.