ASR: పోతంగి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో ఐదుగురు ఉపసంహరించుకోవడంతో పోటీలో తొమ్మిది మంది మిగిలారు. శుక్రవారం అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. తమకు కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్తూ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోతంగి సర్పంచ్ బరిలో తొమ్మిది మంది


