హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 పంచాయతీలు.. 178 వార్డులు ఏకగ్రీవం

ATP: పెద్దపప్పూరు మండలంలో డిసెంబరు 2న జరగాల్సిన పోలింగ్ రద్దయింది. మండలంలోని మొత్తం 20 గ్రామ పంచాయతీలు, 178 వార్డులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ అవసరం లేకుండా పోయిందని ఎంపీడీవో తెలిపారు. ఈ నేపథ్యంలో మండలానికి కేటాయించిన పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.