హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాట్‌ఫామ్‌పై హెచ్చరిక బోర్డులు కరువు

కోనసీమ: ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ సరైన వెలుతురు లేకపోవడం, రాళ్లు, వ్యర్థాలు చెల్లాచెదురుగా ఉండటంతో రైళ్లు దిగే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. అధికారులు వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.