హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం

బాపట్ల జిల్లాలో రెండో దశ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసిందని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.