ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఈ నెల 29న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగిసింది. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చిందని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు'


