హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంటల బీమాలో రైతులు నమోదు కావాలి'

ఏలూరు: జిల్లాలోని అర్హులైన రైతులందరూ పంటల బీమా పథకాల్లో నమోదు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. వరి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తిస్తుందని, మామిడి, జీడిమామిడి పంటలకు వాతావరణ ఆధారిత బీమా అందుబాటులో ఉందన్నారు. గడువులోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు.