హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెకండ్ ఫేజ్‌లో 80 ఏకగ్రీవాలు

CTR: చిత్తూరు జిల్లాలో సెకండ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బంగారుపాళ్యం, ఐరాల, పులిచర్ల, పూతలపట్టు, రొంపిచర్ల, తవణంపల్లె, యాదమరి, నగరి, నిండ్ర, విజయపురంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2.36 లక్షల మంది. కాగా 173 సర్పంచ్, 748 వార్డు మెంబర్ల కోసం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటికే 80 సర్పంచ్, 1526 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.