కోనసీమ: అమలాపురం పట్టణంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి శనివారం ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తొలి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు


