హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు!

ప.గో: జిల్లా స్థాయి అండర్-10, 13, 15 ఆర్చరీ ఎంపిక పోటీలను ఇవాళ భీమవరంలో నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్. జయరాజు తెలిపారు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఉదయం 9 గంటలకు పోటీల వేదికైన లెనిన్ ఆర్చరీ అకాడమీ వద్ద హాజరు కావాలన్నారు. వివరాలకు 8499872291, 9849181993 నంబర్లలో సంప్రదించాలన్నారు.