VSP: అగనంపూడి పరిధి అన్నపూర్ణనగర్‌కు చెందిన మాడిశ అభినవ్ నందా జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ చాటాడు. కేరళలోని కొచ్చిలో ఈ నెల 22న జరిగిన సిప్ అబాకస్ నేషనల్ ప్రాడిజీ-2026లో దేశవ్యాప్తంగా వేల మంది పాల్గొన్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అభినవ్ మూడో రన్నరప్‌గా నిలిచాడు. ఈ మేరకు స్థానిక నాయకులు ఎం. వెంకటరావు, వై. చినఅప్పారావు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ


