హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

AKP: ఎలమంచిలి-రేగుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందాడు. బోగీ గేటు వద్ద నిలబడి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. మృతదేహాన్ని రైలు చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించారు.