NLR: జిల్లాలో ఈనెల 30న సామాజిక పెన్షన్ల నగదు పంపిణీ చేపట్టనున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,85,799 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు పంపిణీ సమయంలో అందుబాటులో ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 30న సామాజిక పెన్షన్ల పంపిణీ: DRDA


